calender_icon.png 6 October, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు చేస్తే లాభాల సిరి..

06-10-2025 12:00:00 AM

  1. జిల్లాలో వెదురు బొంగు సాగుతో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు
  2. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంట 

ఆదిలాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాం తి): అది గడ్డి జాతి మొక్కే అయినా ఉక్కుతో సమానమైన కలపను అందించే పంట... దాని ఆకు నుండి వేరు వరకు అన్నీ ఉపయోగపడేవే... మానవ జీవితంలో ఎన్నో రకాలు గా ఉపయోగపడుతున్న మొక్క కూడా... మానవాళికి ఎన్నోరకాల ప్రయోజనాలను చేకూర్చుతూ ఆకుపచ్చ బంగారంగా పిలువబడుతున్న ఆ మొక్కలే వెదురు పంట.... సమాజానికి ఆర్థిక, పారిశ్రామిక, పర్యావరణ ప్రయోజనాలను చేకుర్చుతున్న వెదురుపై ప్రత్యేక కథనం..

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేదిగా గుర్తింపు పొందిన పంట వెదు రు పంట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ఈ వెదురు మొక్కలు విస్తారంగా కనిపిస్తాయి. ఇంకా అక్కడక్కడ పొలం గట్లపైనా, ఖాళీ ప్రదేశాలలో సైతం దర్శనమి స్తున్నాయి. అయితే ఈ వెదురు కొందరి ఉపాధి ఆధారంగా నిలుస్తోంది. అటవీ ప్రాంతంలో నివాసముండే కొలాం గిరిజనులతో పాటు మైదాన ప్రాంతంలో ఉండే మహేంద్రుల కుల వృత్తికి ఈ వెదురు సాగు ఉపాధిగా ఆధారంగా నిలుస్తోంది. వీరు ఈ వెదురుతో శాటలు, గంపలు, బుట్టలు, తడకలు అల్లి విక్రయిస్తూ ఉపాధిని పొందు తున్నారు.

ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న మహేంద్రుల కుటుంబాలు ఆది లాబాద్ జిల్లాలో వందల సంఖ్యలోనే ఉన్నాయి. వీరు అటవీ ప్రాంతం నుండి లేక తోటల నుండి వెదురు బొంగు లను తీసుకువచ్చి రకరకాల వస్తు సామాగ్రిని తయారు చేసి ఉపాధిని పొందుతున్నారు.

ఇంకా కొందరు ఈ వెదురుతో రకరకాల గృహలంకార వస్తువులను కూడా తయారు చేసి ఉపా ధిని పొందుతున్నారు. ఈ వెదురు తక్కువ పెట్టుబడితో ఎక్కువగా ఆదాయాన్నిచ్చే పంటగా కూడా గుర్తింపు పొందింది. రైతుకు భరోసాను ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తున్న ఈ వెదురు సాగును మనదగ్గర కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

ఎవరైనా పెంచుకోవచ్చు..

ఈ వెదురు పుట్టింది గడ్డి జాతిలో అయి నా చెట్టుగా ముద్రపడి అటవీ ప్రాంతాలలోనే పెంచబడింది. ప్రస్తుతం వెదురు అందరి మొక్కగా మారింది. గడ్డి జాతి మొక్క అయిన ఈ వెదురును ఎవరైనా పెంచుకోవచ్చు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఆదిలా బాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ వెదురును విరివిగా సాగుచేస్తున్నారు. కొందరు పొలంచుట్టు కంచెగా కూడా  వేసుకొని పంటలను అడవి జంతువుల బారి నుండి కాపాడుకుంటున్నారు.

కాగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభు త్వం ఈ వెదురు సాగును ప్రోత్సహించాలని నిర్ణయంతీసుకుంది. జాతీ య వెదురు మిషన్ పథకం కింద రైతులకు రాయితీ ఇవ్వడంతో పాటు గిరిజన ప్రాంతాలలో మహిళ స్వయం సహయక సంఘాల ఆధ్వర్యంలో వెదురు సాగు ను చేపట్టెందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెదురు పంట సమాజానికి ఆర్థిక, పారిశ్రామిక పర్యావరణ ప్రయోజనాలను చేకూరుస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.

రైతులకు ఆర్థిక భరోసాని, కుటీర పరిశ్రమకు ఊతాన్ని  పర్యావరణానికి హితాన్నిచేకూర్చుతున్న ఈ వెదురు ఎదురులేకుండా ఎదిగి అందరికి చేరువకానుండం శుభపరిణామంగా చెప్పవచ్చు. ఎన్నో సుగుణాలను తనలో ఇము డ్చుకొని ఉన్న ఈ వెదురు నమ్ముకున్నవారికి లాభాలను తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.