05-10-2025 06:06:18 PM
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని, ఆయనంటే గిట్టని వాళ్లు ఈ ప్రచారం చేస్తున్నారని, రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మెద్దు అని దానం పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తప్పుడు ప్రచారం ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు.