30 August, 2026 | 11:20 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

గడ్డం తీసేసింది నిజమే, కానీ..

20-07-2024 01:38 AM

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప2’. అయితే, హీరోకు, డైరెక్టర్‌కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే అర్జున్ గడ్డం తీసేసి విదేశాలకు వెళ్లారని ప్రచారం జరిగింది. ఈ రూమర్స్‌పై నిర్మాత బన్నీ వాసు శుక్రవారం ‘ఆయ్’ ఈవెంట్‌లో స్పందించారు. “ఆ చిత్రంపై వచ్చిన రూమర్స్ విని, కొన్ని ఆర్టికల్స్ చదివి నవ్వుకున్నా.  అర్జున్ పాత్ర షూటింగ్ ఇంకా 15 రోజులే మిగిలి ఉంది. క్లుమైక్స్, ఓ సాంగ్‌లో ఆయన నటించాల్సి ఉంది. క్లుమైక్స్ తీయకముందే ఎడిటింగ్ ప్రారంభించాలని సుకుమార్ అనుకున్నారు. దానికి 35 రోజుల టైం పడుతుంది. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో టూర్ వెళ్లేందుకు అర్జున్ గడ్డం తీసేశారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నాకు, అర్జున్‌కు సుకుమార్‌తో మంచి బంధం ఉంది” అన్నారు.