calender_icon.png 3 December, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం హిందూ దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదు

03-12-2025 04:58:16 PM

- వెంటనే బేషరత్ గా క్షమాపణ చెప్పాలి..

- మాజీ మేయర్ వై సునీల్ రావు..

కరీంనగర్ (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి హిందు దేవతలను కించపరుస్తూ... వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని... చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని... బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వం అంతా.... ముస్లిం అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే ముస్లిం అనే భావాజాలంతోనే పని చేస్తున్నారని మండిపడ్డారు. మీ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అండగా ఉన్నా.... టోపిలు పెట్టుకుని మజీదుల్లో నమాజ్ లు చేసిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.... హిందువులను కించపరిచేలా హిందు దేవతలపై వాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు.

ఎంఐఎం అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే ఎంఐఎం అని ప్రజలందరికి అర్థమైందనీ తెలిపారు. హిందు దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ... హిందువుల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకెవరిచ్చారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో హిందు సమాజం అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హిందు దేవతలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీస్కోని... హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.