03-12-2025 05:02:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): దివ్యాంగులను సమాజం ఆదరించాలని, వారిని ఎప్పుడు కూడా చిన్నచూపు చూడొద్దని, వారిని జనజీవన స్రవంతిలో కలుపుకోవాలని, వారిలోని శక్తియుక్తులను, సృజనాత్మకతలను సమాజం వాడుకోవాలని మండల విద్యాధికారి తోడిశెట్టి పరమేశ్వర్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక విలీన భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులైన పిల్లలకు ప్రభుత్వం ద్వారా లభించనున్న వివిధ రకాల పథకాలను అవకాశాలను రిజర్వేషన్లను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పిల్లలకు వివిధ పాటల పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్, ఎంపిఓ జ్యోతి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు త్రివేణి, విలీన భవిత కేంద్రం ఇన్స్ట్రక్టర్ సంధ్య రాణి పోషకులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.