రాష్ట్రానికి పెట్టుబడులు రావాలనేదే ప్రభుత్వం లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, పెట్టుబడులకు రాష్ట్రంలో మంచి వాతావరణం ఉందని వివరించేందుకు విదేశాలుకు వెళ్లాం. రాబోయే 20 ఏళ్లపాటు కాంగ్రెస్ లక్ష్యం, గమ్యం ఏమిటో పలు సంస్థలకు వివరించి, దక్షిణ కొరియాలో అనేక కంపెనీలతో చర్చలు జరిపామన్నారు.
రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, ఏఐ, సెమీ కండక్టర్ల తయారీలో దిగ్గజ సంస్థలతో గంటలకొద్దీ చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. మూసీ సుందరీకరణపై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతోనూ చర్చలు జరిపామని చెప్పారు. రాష్ట్రంలో బయోడిజైర్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని కోరినట్లు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 19 సంస్థలతో రూ.31,500 కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఏఐ సీటి, ప్యూచర్ సీటిలో పెట్టుబడులపై చర్చించామని, పెట్టుబడులతో 30,750 ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.






