గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం
బల్మూరు,(విజయక్రాంతి): కొండనాగుల గ్రామంలో పల్లె పాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం మార్నింగ్ వాక్ నిర్వహించి గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు విద్యుత్తు, తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతులపై ఆరా తీశారు. సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేసే గ్రామ అభివృద్ధిని కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వారి విద్య అభ్యాసానికి శుభ ప్రారంభం చేశారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు, అనంతరం పి ఎస్ సి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తేమశాతం నమోదు చేయాలని అదే విధంగా రవాణా చెల్లింపులు వివరాలను అడిగి తెలుసుకున్నారు, రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాట్రాజు పద్మ, మాజీ జెడ్పిటిసి అరుణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాంప్రసాద్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీపతిరావు, చంద్రమోహన్ యాదవ్, మాసన్న, కాశన్న యాదవ్, ఖదీర్, తో పాటు గ్రామ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు






