డిగ్రీ కళాశాల హాస్టల్లో వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి
బల్మూరు,(విజయక్రాంతి): శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొండానాగుల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కళాశాలకు హాస్టల్ మంజూరు చేయవలసిందిగా కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు బుధవారం కొండనాగుల గ్రామంలో వినతిపత్రం అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఫరంగి రవి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నందున, హాస్టల్ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే కు ఇచ్చిన ప్రతిపత్రంలో విన్నవించుకున్నట్లు వారు తెలిపారు, కళాశాల మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన కొరకు సీఎస్ఆర్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ కళాశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.






