నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేయాలి
- ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశం
- ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన
కోహెడ, జూన్ 11: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామ శివారులో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులను కలెక్టర్ కె. హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే నిర్మాణ పురోగతిలో అగ్రస్థానంలో ఉందని 23 ఎకరాల్లో అతి పెద్ద విద్యాసంస్థ నిర్మాణం పూర్తి కానుందన్నారు. మంచి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణిత కాల వ్యవధిలో యుద్ద ప్రతిపాదికన పూర్తి చెయ్యాలని ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
స్కూల్ నిర్మాణ ప్రాంతం మొత్తం కలియ తిరిగారు. చుట్టూ కొండల నడుమ పచ్చని చెట్ల మద్య నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్రంలో ఒక రోల్ మెడల్ గా నిలుస్తుందని తెలిపారు. నిర్మాణం పూర్తి అయేవరకు రెవెన్యూ అధికారులు తరుచు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. కార్యక్రమం తహసీల్దార్ నవీన్ కుమార్, ఆర్‌ఐ ఎల్లయ్య పాల్గొన్నారు.






