calender_icon.png 18 November, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలిమెల విద్యార్థుల విహారయాత్రకు దాతృత్వ సహాయం

18-11-2025 08:15:58 AM

యాత్రదానం కార్యక్రమంలో ఆశం గారి వీరమ్మ, ఆశం గారి రాజు చెక్కు అందజేత

సంగారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల ప్రవేశపెట్టిన ‘యాత్రదానం’ కార్యక్రమానికి గ్రామ స్థాయిలో మంచి స్పందన లభిస్తోంది. వెలిమెల గ్రామానికి చెందిన ఆశం గారి వీరమ్మ, ఆమె కుమారుడు ఆశం గారి రాజు సామాజిక సేవలో భాగంగా వెలిమెల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల విహారయాత్ర కోసం ముందుకు వచ్చి దాతృత్వ సహాయంగా చెక్కును అందించారు. స్కూల్ హెడ్ మాస్టర్ అశోక్ రెడ్డి, ఉపాధ్యాయుడు సుభాష్ ఆధ్వర్యంలో, ఆర్టీసీ బస్ స్టేషన్ మేనేజర్ ఇస్సాక్, ఆర్టీసీ కాలనీ బస్సు ఆఫీసర్ రవికుమార్ సమక్షంలో చెక్కును అందజేశారు. విద్యార్థుల అధ్యయన వికాసం, వ్యక్తిత్వ అభివృద్ధికి ఇటువంటి విహారయాత్రలు ఎంతో ఉపయుక్తమని అధికారులు అభిప్రాయపడ్డారు. గ్రామస్థులు ఆశం గారి కుటుంబం చేసిన దాతృత్వాన్ని అభినందించారు. యాత్రదానం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు, సహకరించిన ప్రతీ ఒక్కరికీ హెచ్‌.సి.యూ డిపో మేనేజర్ శ్రీనాథ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.