23 August, 2026 | 11:52 PM

మూడు రోజులు వర్షాలు

13-06-2024 01:41 AM

వాతావరణ కేంద్రం

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ క్రమంలో గురువారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.