మోగిన బడి గంట
తెరుచుకున్న పాఠశాలలు
సెలవులకు టాటా చెప్పి
బడి బాట పట్టిన విద్యార్థులు
రాష్ట్రంలో బడి గంట మోగింది. విద్యార్థులు సెలవులకు టాటా చెప్పి బడిబాట పట్టారు. ఇన్ని రోజులుగా సెలవుల్లో సరదాగా గడిపిన పిల్లలు బుధవారం పాఠశాలలకు భుజంపై పుస్తకాల బ్యాగుతో పయనమయ్యారు. మొదటి రోజు కావడంతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందించి స్వాగతం పలికారు.
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, జూన్ 12 :
హైదరాబాద్‌లోని ఆలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో జరిగిన బడిబాట, పాఠశాలల పునఃప్రారంభోత్సవ వేడుకల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించి మాట్లా డారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జిల్లా పరిషత్తు పాఠశాల ఆవరణలో జరిగిన బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతు కే జండగే పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, మాజీ మంత్రి, సిద్ది పేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ రోజారాధాకృష్ణ శర్మ, కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రారం భోత్సవ కార్యక్రమాల్లో వారు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అంద జేశారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అంద జేశారు.
రంగారెడి జిల్లా ఫరుఖ్ నగర్ మండలంలోని మొగలిగిద్ద పాఠశాలలో నిర్వహిం చిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు పంపిణీ చేశారు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశా లలో బడిబాట కార్యక్రమాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు.
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు జహీరాబాద్‌లోని ఎంపీయూ పీఎస్-3 పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం నూతనకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం మండలంలోని వై మాందాపూర్, సంగాయిపేట గ్రామాల పాఠశా లల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు అందించారు.
పాఠశాలకు హాజరైన విద్యార్థులకు పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయలు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు.






