యువకుడి తిరుగుబాటుతో మొదలు
అసద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 2011లో దారా నగరంలో మౌవియా సియాస్నే(27) అనే యువకుడు చేసిన తిరుగుబాటుతో సిరియాలో అంతర్యుద్ధానికి నాంది పలికాడు. అప్పుడు 14 సంవత్సరాల వయస్సున్న మౌవియా.. అసద్‌కు వ్యతికేకంగా గోడలపై స్ప్రే పెయింట్( గ్రాఫిటీ) వేశాడు. దీంతో తమ స్వేచ్ఛ కోసం వారు గోడలపై విస్తృతంగా అసద్‌కు వ్యతిరేకంగా బొమ్మలు వేసి ప్రజలను చైతన్య పరిచారు. ఈ క్రమంలో పోలీసులు అతని కుటుంబాన్ని, స్నేహితులను అదుపులోకి తీసుకుని తీవ్రంగా వేధించారు.
వారిని విడిపించడానికి ప్రజలు, తల్లిదండ్రులు, స్థానికులు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. అయితే ఈ ఆందోళనలను ప్రభుత్వం క్రూరంగా అణిచివేసింది. గాయపడ్డ మౌవియా, అతని ఫ్రెండ్స్ ఫొటోలు బయటకు రావడంతో దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అసద్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ మొదలై తిరుగుబాటుకు దారితీసింది.






