16 July, 2026 | 8:50 AM

బీమా సఖీ యోజనను ప్రారంభించిన ప్రధాని మోదీ

09-12-2024 03:45 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): హరియాణా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో బీమా సఖి యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. బీమా సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. బీమా సఖీ యోజనతో మహిళలకు శిక్షణ, ఉపాధి, ఉద్యోగావకాశాలు, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహన కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్ఐసీ వెల్లడించింది. మూడేళ్లలో 2 లక్షల మంది మహిళలకు స్వావలంబన లక్ష్యంగా ఈ పథకాన్ని ఎల్ఐసీ ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను ప్రధాని మోదీ అందజేశారు.