14 August, 2026 | 2:29 AM

మళ్లీ వచ్చింది..!

14-08-2026 12:00 AM

గొంతులో నీటి చుక్క పడక నెర్రలిచ్చిన నేలల్లో కరువు మొలిచి ఆకలితో సొమ్మసిల్లే పల్లెలన్నీ పిల్లాజెల్లాతో తట్టాబుట్టా సర్దుకొని తల్లిలాంటి పల్లె పొలిమేరలు దాటి ఆకలి జెండాల్లా చీమలబారుల్లా నగరాలకు ఎగబాకుతోంటేసాపాటే పెద్ద గ్రహపాటైన చోట తలదాచుకొనే చోటేక్కడ..!అక్షరాలాపేసిన చిట్టి చేతులచే ఇటుకతట్ట పట్టించి ఆకాశహార్మ్యాలు కట్టించేస్తోంది ఆకలి నడుం వొంగిన తాత కడుపుఅంతస్తుపై అంతస్తులు నిలబెడుతోంది.

పాలుతాగే పిల్లాణ్ణి సైతం అల్లరి చేయకుండా అమ్మకష్టం కట్టిపడేస్తోంది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచితరతరాల తరగని దారిద్య్రాన్నే పెట్టుబడిగా పాలిస్తున్న రాజకీయం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ, కింద ఆకలి వెక్కిరిస్తున్నా నాలుగు రోడ్ల కూడళ్లలో మూడు రంగుల జెండాలై ఎగురుతోంది..!?

వ్యాసకర్త సెల్: 9949800253