calender_icon.png 7 June, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలా నిందించడం కరెక్ట్ కాదు

06-06-2025 12:00:00 AM

ఏ సినిమా ఫ్లాప్ అయినా నటీనటులనే నిందిస్తారని, అలా చేయడం సరైన పద్ధతి కాదని అంటోంది రీతూవర్మ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘దేవిక అండ్ డానీ’. ఈ సిరీస్ శుక్రవారం (నేడు) నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రీతూవర్మ చేసిన వ్యాఖ్య లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. “నాకు బాక్సాఫీస్ బిజినెస్‌పై పెద్దగా అవగాహన లేదు.

అయితే, ప్రతి సినిమా విజయం సాధించాలనే నటీనటులు కోరుకుంటారు. జయాపజయాల విషయమై కెరీర్ ఆరంభంలో బాధపడేదాన్ని. ఇప్పుడా ఆలోచనే మానేస్తున్నా. నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని ఫోకస్ యాక్టింగ్‌పైనే పెడుతున్నా. చాలాసార్లు హీరోహీరోయిన్లను నిందిస్తుంటారు. గోల్డెన్ లెగ్ అని.., ఐరన్ లెగ్ అని ట్యాగ్స్ ఇస్తుంటారు. 24 క్రాప్ట్స్ కలిస్తేనే సినిమా.

కాబట్టి, పరాజయం పాలైనప్పుడు ఒక్క వ్యక్తిని నిందించడం కరెక్ట్ కానేకాదు. ‘అలాంటి పాత్ర చేయలేదు.. ఇలాంటి సినిమా చేయలేదు’ అడుగుతుంటారు. అలాంటి అవకాశం నాక్కూడా రావాలి కదా! వచ్చిన ఆఫర్స్ నుంచి నచ్చింది ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నా. సంతోషంగా ఉన్నా” అని తెలిపింది.