8 July, 2026 | 3:51 AM

హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర ప్రోమో

19-12-2024 12:00 AM

రామ్ చరణ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వాణి హీరోయిన్‌గా నటిస్తోంది. నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర’ పాట ప్రోమోను టీమ్ విడుదల చేసింది. ఫుల్ సాంగ్ ఈనెల 22న విడుదల కానుంది. ఈ నెల 21న అమెరికాలోని డల్లాస్‌లో ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇటీవలే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఏడాది జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.