03-06-2025 10:40:47 PM
నియమించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య..
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండలంలో జాతీయ మానవ హక్కుల కమిటీ(National Human Rights Commission) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఏటూరునాగారం మండల అధ్యక్షులుగా మండలంలోని శంకర్రాజుపల్లి గ్రామానికి చెందిన జాడి రాజేష్ ను నియమించారని జిల్లా నాయకులు గంపల శివకుమార్ తెలిపారు. జిల్లా అధ్యక్షులు పెట్టిం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు ఈ మేరకు నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర, జిల్లా కమిటీల అదేశాల మేరకు పని చేయాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఆర్ సి. ఏటూరునాగారం మండల అధ్యక్షులుగా నియమితులైన జాడి రాజేష్ మాట్లాడుతూ... మండల కమిటీతో పాటు అన్ని గ్రామ కమిటీలను పూర్తి చేస్తానని, సమస్యల పరిష్కారంలో పేద ప్రజల పక్షాన కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకు ఈ పదవి రావడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్, జిల్లా అధ్యక్షులు పెట్టెం రాజు, జిల్లా నాయకులు సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, గాదె శ్రీనివాసచారి, గంపల శివకుమార్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.