జగజ్జీవన్‌రామ్ బయోపిక్ జూలైలో
16-12-2024 12:30 AM
బాబు జగజ్జీవన్‌రామ్ జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘బాబు జగజ్జీ వన్‌రామ్’. పెదరావూరు ఫిలిం స్టూడియోస్ బ్యానర్‌పై దర్శకుడు దిలీప్ రాజా రూపొందిస్తున్నారు. జగజ్జీవన్‌రామ్ పాత్రలో మిలటరీ ప్రసా ద్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.
‘స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ సేవల గురించి ప్రేక్షకులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నాను. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి అయిన జూలై 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్‌కు తీసుకొస్తాం’ అని దర్శకుడు తెలిపారు.






