18 July, 2026 | 2:17 AM

భక్తి పారవశ్యంలో జగన్నాథ రథయాత్ర

18-07-2026 02:17 AM

స్వామి నామస్మరణతో మారుమోగిన బోధన్

బోధన్ జులై 17 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవం శుక్రవారం సేవా కుంజ్ భక్త బృందం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించా రు. రాకాసిపేట్లోని సేవా కుంజ్ నుంచి ప్రా రంభమైన రథయాత్ర అంబేద్కర్ చౌరస్తా, పెద్ద హనుమాన్ మందిరం, పాత బస్ స్టాం డ్, కొత్త బస్ స్టాండ్ మీదుగా తిరిగి అంబేద్కర్ చౌరస్తా గుండా టీటీడీ కల్యాణ మం డపానికి చేరుకుంది. యాత్రలో భక్తులు ‘జై జగన్నాథ‘ నామస్మరణలు, భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్ప గా, స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తుల కు మహా అన్నప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో పం పిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పా ర్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దాము, సీఐ వెంకట నారాయణ, రవిగౌడ్ ప్రభుజీ, సేవా కుంజ్ సభ్యులు, భ క్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొ ని జగన్నాథ స్వామివారి ఆశీస్సులు పొందా రు. సేవా కుంజ్ ఆధ్యాత్మిక సేవలను విఠల్ ప్రభుజీ వైశాలి మాతాజీ, శ్రీరామ్ ప్రభుజీ శాంతి మాతాజీ ప్రభు శ్యామ్, మాధవీ మాతాజీ, వాణి మాతాజీ ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగిస్తున్నారు.