07-10-2025 10:24:04 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్డు పనులు ఆలస్యం కావడంతో, మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ (ఐబి) నుండి బసవేశ్వర విగ్రహం వరకు రోడ్డు పనులను జగ్గారెడ్డి పరిశీలించారు. రోడ్డు పనులు ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. పనుల జాప్యానికి కారణాలను హెచ్ఎండిఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపుల చెట్లు, కరెంటు స్తంభాల వల్ల రోడ్డు పనులు జాప్యం జరుగుతుందని అధికారులు తెలిపారు. డిప్యూటీ ఇంజినీర్ ఎలక్ట్రిసిటీ ఫారెస్ట్ అధికారులను స్వయంగా పరిశీలనకు తీసుకెళ్లి తగు సూచనలు చేయడం జరిగింది. పనులు వేగంగా చేయాలని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు.
బై పాస్ రోడ్డులో నాలుగు జంక్షన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఏఈ వెంకన్న, ఎలక్ట్రిసిటీ ఏడిఈ లక్ష్మణ్, ఆర్ అండ్ బి డి.ఈ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ డిఈ రఘు, ఫారెస్ట్ అధికారులు, నియోజకవర్గ ఇంచార్జి జూలకంటి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, నాయకులు తోపాజి అనంత కిషన్, కూన సంతోష్, షఫీ, కిరణ్ గౌడ్, మహేష్, ఉదయభాస్కర్, విక్రాంత్ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.