ఇంటర్ ఫలితాల్లో జాగృతి విజయభేరి
16-04-2026 12:19 AM
అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): జాగృతి జూనియర్ కళాశాల, మల్కాజ్‌గిరి విద్యార్థులు ఈ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు కీర్తి తీసుకువచ్చారు. అత్యధిక మార్కులు సాధించి ప్రతిభను చాటుకున్న విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎ.పరమేశ్వర్, వైస్ చైర్‌పర్సన్ ఎ.లక్ష్మి విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి భవిష్యత్తు మరింత విజయవం తంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం వలన ఈ విజయాలు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.






