29 April, 2026 | 3:23 AM

జాఫర్గఢ్ ఖిల్లాలో జైనబసది

29-04-2026 01:56 AM

హైదరాబాద్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు వే ల్పుగొండవాసి సముద్రాల రాజు జాఫర్గఢ్ ఖి ల్లా కిందివైపు పాటిగడ్డమీద జైనబసది అవశేషాలను గుర్తించారు. రాష్ట్రకూట ప్రభువు అ మోఘవర్షుని రాజప్రతినిధి, బంధువు, కొలనుపాక పాలకుడు శంకరగండరస వేల్పు గొండ(జాఫర్గఢ్)లో కొండమీద చెక్కించిన శా సనంవల్ల అమోఘవర్షుని పేర దుర్గం నిర్మించబడ్డదని, కుండం తొలిపించబడ్డదని, ఇక్కడ జైన బసదివుండేదని తెలుస్తున్నదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వివరించారు. ఇప్పటివ రకు మాల్చగుట్ట వద్ద జైనశిల్పాలు, జైనమానస్తంభం, మరికొన్ని జైనం ఆనవాళ్లు తప్ప జైనబసది జాడ లభించలేదు.

సముద్రాల రాజు అ న్వేషణతో ఒక చారిత్రక నిర్మాణాన్ని గుర్తించడమైంది. ఇక్కడ లభిస్తున్న అవశేషాలలో జైనబసది ద్వారబంధం చాలా ఎత్తుగా వుండేదని, పంచశాఖపద్ధతిలో చెక్కబడిన ద్వారశా ఖలు(శేరెలు), వాటి మీద తీర్చిదిద్దిన పూలతలు, వాటిలో హంసలు, 4రేకలతో మణిఖచి త పట్టికలు అగుపిస్తున్నాయి. చక్కని డిజైన్లతో తీర్చిదిద్దబడిన పెద్ద ద్వారబంధం ఇది. ఈ శకల ద్వారబంధం పతంగం(ఉత్తరాశి)మీద లలాటబింబంగా ధ్యానాసనస్థితిలోనున్న మ హావీరుని శిల్పం చెక్కబడి ఉంది. 

ఈ అవశేషా లను పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఈ లలాటబింబమే జాఫర్గఢ్ లో గొప్ప జైనబసది వుండేదనడానికి సాక్ష్యం, చారిత్రక ఆధా రమని తెలిపారు. ఒక చాళుక్యశైలి మంటప స్తంభం చతురస్ర ఫలకాల నడుమ గుండ్రని స్తంభిక మీద అష్టఫలక పట్టిక ఉంది. ముక్కలైన ద్వారబంధం మీద చెక్కడాలు శిల్పుల పనితనానికి నిదర్శనంగా మిగిలి ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే రాష్ట్రకూటుల కాలానికి చెం దిన సప్తమాతృకలలో ఉండే రెండు వేర్వేరు ఆరాధనారీతులకు చెందిన ఇంద్రాణి, బ్రాహ్మీ శిల్పాలను కూడా రాజు గుర్తించాడు. ఇక్కడ పడి ఉన్న శిథిలాలను పరిశోధిస్తే మరిన్ని చారిత్రక ఆధారాలు లభిస్తాయని, తెలంగాణ వార సత్వశాఖ పూనుకుని వీటిని కాపాడాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం మనవి చేస్తున్నది.