29 April, 2026 | 3:24 AM

కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి

29-04-2026 01:56 AM

జిల్లా అధికారులతో సమీక్ష

జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క

కామారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోని ఆదర్శంగా నిలవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి అభివృద్ధి చెపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలో తాగునీటి సరఫరా సాగునీటి పరిస్థితి సివిల్ సప్లై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎండాకాలంలో వడదెబ్బల నివారణ చర్యలు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న 99 సంక్షేమ అభివృద్ధి పథకాలతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఎండాకాలంలో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున ప్రజల ఆరోగ్యంతో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సాగునీటి అవసరాలు కూడా సమయానికి తీర్చాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇందా నిర్మాణంలో ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు వేగవంతం చేయాలని అరువులు అందరికీ లబ్ధి చేకూరాలని చూడాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,  జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ శెట్కర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ లు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమన్వయంతో జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని  వారన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అనంతరం కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం కళాభారతి మండపంలో మహిళా సంఘాలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు చైర్ సైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విక్టర్, మధుమోహన్, డిఆర్డిఓ  పిడి సురేందర్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల, సివిల్ సప్లై జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.