calender_icon.png 28 September, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుఎన్‌జీఎ సందర్భంగా జైశంకర్ కీలక ద్వైపాక్షిక సమావేశాలు

28-09-2025 11:00:02 AM

న్యూయార్క్: న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల(80th United Nations General Assembly) సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(External Affairs Minister S Jaishankar) ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్(United Nations chief Antonio Guterres), యుఎన్‌జిఎ అధ్యక్షురాలు అన్నలెనా బేర్‌బాక్‌తో సహా ఉన్నతాధికారులతో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. శనివారం జైశంకర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్‌తో సమావేశమై భౌగోళిక రాజకీయ పరిణామాలు, ప్రపంచ హాట్‌స్పాట్‌లు సహా అనేక అంశాలపై చర్చించారు. ప్రస్తుత సవాళ్లపై భారతదేశం దృక్పథాలను కూడా ఆయన పంచుకున్నారు.

ఇవాళ న్యూయార్క్‌లో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్(António Guterres)ని కలవడం సంతోషంగా ఉంది. UN@80, భౌగోళిక రాజకీయ ధోరణులు, ప్రస్తుత హాట్‌స్పాట్‌లు & భారతదేశ దృక్పథాలను చర్చించారని జైశంకర్ ఎక్స్ లో పేర్కొన్నారు. యుఎన్‌జిఎ(UNGA) అధ్యక్షురాలు బేర్‌బాక్‌తో జరిగిన ప్రత్యేక సమావేశంలో జైశంకర్ ఆమె అధ్యక్ష పదవికి భారతదేశం తరపున పూర్తి మద్దతును తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిని మన కాలానికి మరింత సందర్భోచితంగా, ప్రతిబింబించేలా చేయడానికి దానితో కలిసి పనిచేయడానికి భారతదేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందన్నారు.

జైశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన అల్జీరియా విదేశాంగ మంత్రి అహ్మద్ అత్తాఫ్‌తో కూడా సమావేశమై భారతదేశం, అల్జీరియా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై మాట్లాడారు. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో పరిణామాలపై అభిప్రాయాలను కూడా పంచుకున్నట్లు జైశంకర్ వెల్లడించారు.