05-05-2024 12:05:00 AM
అమెరికా అధ్యక్షుడి జెనోఫోబియా కామెంట్‌పై జైశంకర్
న్యూఢిల్లీ, మే 4: భారత్‌లో విదేశీయులం టే భయం ఉండటం (జెనోఫోబియా) ఉండ టం వల్లనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించటం లేదన్న అమెరికా అధ్యక్షుడు జో బైడె న్ వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ తిప్పటికొట్టారు. భారత్ ఎప్పుడూ విదేశీయులకు తలుపులు తెరిచే ఉంచుతుందని, స్వాగతిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. శనివారం ఓ మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటూ నిరాశ్రయులై నవారికి భారత్‌లో ఆశ్రయం కల్పించేందుకు రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టమే (సీఏఏ) అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. బైడెన్ చెప్పినట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఏమీ లేదని స్పష్టంచేశారు. ‘భారత్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన దేశమే. ప్రపంచ చరిత్రలో అత్యంత వైవిద్య సమాజమున్న దేశం భారతే. భిన్న సమాజాల నుంచి వచ్చిన భిన్నమైన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.