22-05-2025 01:59:48 PM
హైదరాబాద్: బేగంపేటలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) మాట్లాడుతూ... 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
బ్యాంకింగ్ రంగం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని భట్టి తెలిపారు. యువత కోసమే తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చిందని వివరించారు. రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam Scheme) పథకానికి రూ. 6,250 కోట్ల సబ్సిడీ రూపంలో ఇస్తోందని తెలిపారు. యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి జీడీపీ(GDP) పెరిగే విధంగా పథకం రూపకల్పన చేశామని చెప్పారు. జూన్2న 5 లక్షల మంది యువతకు పంపిణీ చేస్తున్నామని విక్రమార్క వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. మానవ వనరులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్తుందన్నారు.