22-05-2025 01:36:35 PM
పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్ద హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్యాల కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ను వేదమంత్రాలతో ఆశీర్వాదించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఆంజనేయస్వామి ఆశీర్వాదాలు సుఖసంతోషాలతో జీవించాలని, ఈ ఏడు పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినిపల ప్రకాష్ రావు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, దుగ్యల సంతోష్ రావు, సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక సతీష్, పోల్సని సునీల్ రావు, పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల నరేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.