calender_icon.png 20 January, 2026 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముల్కనూర్ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్‌గా జక్కుల ఐలయ్య

20-01-2026 12:16:11 AM

రికార్డు స్థాయిలో టెండర్ వేలం పాటలు

భీమదేవరపల్లి, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ జిల్లాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముల్కనూర్ లో జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా జక్కుల ఐలయ్య నియామకం అయ్యారు. సోమవారం ముల్కనూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతరలో దుకాణాల ఏర్పాటుకు ముల్కనూర్ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, కొత్తకొండ ఆలయ ఈవో కిషన్ రావు, ఎంపీడీవో వీరేశం ముల్కనూర్ ఈవో పూర్ణ చందర్,

ఊస కోయిల ప్రకాష్ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొబ్బరికాయలు అమ్ముకునేందుకు 1,35,000, లడ్డు పులిహోర అమ్ముకునేందుకు 1, 720,00, కొబ్బరికాయల టికెట్లు ప్రత్యేక దర్శనం కు 1,40,000 వేలం పాటలు జరిగినాయి.