బైక్ ను ఢీకొట్టిన టిప్పర్..
13-12-2024 11:45 PM
యువకుడి దుర్మరణం..
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన శీలం కిరణ్ (23) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కొంగర కలాన్‌లో నివాసం ఉంటున్నాడు. కిరణ్ శుక్రవారం రాత్రి బైక్‌పై కొంగర నుంచి తుక్కుగూడ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో రావిరాల వండర్ లా సమీపంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ అతడి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






