24 August, 2026 | 2:09 AM

పీఎంఆర్ ఆసుపత్రిలో జామర్లు

24-08-2026 12:58 AM

ఆన్‌లైన్ పేమెంట్ చేయలేక అవస్థలు పడుతున్న పేషెంట్ అటెండెంట్

చేవెళ్ళ ఆగష్టు 23(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని డాక్టర్ పట్నం మ హేందర్ రెడ్డి ఆసుపత్రిలో జామర్లు బిగించారు. ఈ కారణంగా నెట్వర్క్ సర్వీస్ జాబ్ కావడంతో  పేషన్స్ వెంట వచ్చే అటెండెన్స్ నాన్న ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ కాలేజీ నిర్వహణ నిబంధనల ప్రకారం స్టూ డెంట్స్ క్లాస్ రూమ్ పరిధి వరకే జామర్లు బిగించుకోవాల్సి ఉన్నప్పటికీ దాదాపు అర కిలోమీటర్ మేర నెట్వర్క్ సర్వీస్ జామ్ చేస్తున్నారు.

ఈ కారణంగా అటెండెన్స్ డే కాకుం డా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు ఉ ద్యోగులు సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం కొంతమంది డాక్టర్స్ ఆస్పత్రిలో పనిచేసే ఎంప్లాయిస్ ఫోన్ లకు మాత్రమే మినహాయింపు ఇచ్చారని తెలుసో ్తంది. ఇది పూర్తిగా ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్వహణకు విరుద్ధమని చెబుతున్నారు. 

పేషెంట్లు ఆవేదన

పీఎంఆర్ ఆస్పత్రిలో జామర్లు అమర్చడం వల్ల ఆన్లైన్ లావాదేవీలు చేయలే కపోతున్నాం. మెడిసిన్ కొనాలంటే నగదు కోసం పరిగెత్తాల్సి వస్తుంది. గేటు బయటకు (దాదాపు 500 మీటర్స్) వచ్చిన నెట్వర్క్ ప నిచేయడం లేదు. కుటుంబ సభ్యులు పేషె ంట్ కండిషన్ తెలుసుకోవడానికి ఫోన్లు చే యగా నెట్వర్క్ జాం కావడంతో టెన్షన్ పడుతున్నారు. 

ఆన్‌లైన్ సర్వీస్ బ్లాక్ చేయడంపై అనుమానాలు

ఆసుపత్రి ఆవరణలో జామర్లు బిగించి ఆన్లైన్ పేమెంట్ నిషేధించడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా మెడిసిన్ కొనాల్సి వస్తే ఫార్మసీ నిర్వాహకులు నగదు క్యాష్ అడగడంతో అటెండెన్ట్లు మనీ కోసం పరుగులు తీస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా నగదు అడగడాన్ని ఆసుపత్రికి వచ్చిన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

యాజమాన్యంతో మాట్లాడుతాం..

ఆసుపత్రిలో ఆన్లైన్ పేమెంట్ జరగదు. కాలేజీ నిర్వహణకు జామర్లు వాడుతున్న మాట వాస్తవమే. దీనికి అనుమతి రావాల్సి ఉంది. రేడియేషన్ వల్ల పేషెంట్స్ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఒక సెల్ టవర్ నిర్మించాల్సి ఉంటుంది. యాజమాన్యంతో మాట్లాడుతాం.

 ఆస్పత్రి సూపరింటెండెంట్ ,రామకృష్ణారెడ్డి