గురుస్వామికి ప్రత్యేక గురుపురస్కారం
ఘట్ కేసర్, ఆగస్టు 23 (విజయక్రాంతి) : హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ లో శనివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు అయ్యప్ప గురుస్వాము లకు పురస్కార ప్రదానం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పురస్కార గ్రహీతలలో ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపురం కి చెందిన ప్రముఖ గురుస్వామి బోనకుర్తి అర్జున్ గురుస్వామి ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు.
రాజు గురుస్వామి, ప్రదీప్ నంబూద్రి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వేడుకలో శ్రీఅయ్యప్ప స్వామి వంశోద్ధారకులు, పందల రాజ్య వంశీయులు, తాంత్రిక గురుస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి పవిత్ర హస్తాల మీదుగా గురుస్వాములకు పురస్కారాలను అందజేశారు. అయ్యప్ప స్వామి సేవలో భక్తులకు దిశా నిర్దేశం చేయడంలో అర్జున్ గురుస్వామి చేసిన కృషికి గాను ఈగౌరవం దక్కింది.






