తొలి ఏకాదశికి మన్నెంకొండ ఆలయంలో సర్వం సిద్ధం
శనివారం తెల్లవారుజామున నుంచే భక్తులు రాకు
ఏర్పాట్లు సిద్ధం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ కుమార్
మహబూబ్‌నగర్ రూరల్(విజయక్రాంతి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో(Manyamkonda Sri Lakshmi Venkateswara Swamy Temple) తొలి ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధమైంది. శనివారం తొలి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం ప్రారంభమై రోజంతా కొనసాగుతుందని ఆలయ చైర్మన్ మధుసూదన్ కుమార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, పారిశుద్ధ్యం, భద్రత, వైద్య సదుపాయాలతో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ఆలయ అధికారులకు సహకరిస్తూ ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






