16 July, 2026 | 9:11 AM

జాట్ రాపిడ్-ఫైర్ యాక్షన్

07-12-2024 12:03 AM

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ యాక్షన్ -ప్యాక్డ్ చిత్రం ‘జాట్’. ఈ సినిమా కోసం దర్శకుడు గోపీచంద్ మలినేనితో సన్నీ డియోల్ తొలిసారి కొలాబరేట్ అయ్యారు. ఈ చిత్రంలో వినీత్‌కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. తాజాగా మేకర్స్ శుక్రవారం విడుదల చేసిన టీజర్ చిత్రంపై మరింత ఆసక్తి పెంచింది. టీజర్‌లోని చాలా మూమెంట్స్ సన్నీ డియోల్ ఫిజిక్ ప్రజెన్స్, ఇంటెన్స్ క్యారెక్టర్‌ను ప్రదర్శించాయి. ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయింది. రాపిడ్-ఫైర్ యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్‌తో టీజర్ ఆకట్టుకుంది. 2025, ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్‌లక్ష్మణ్, వెంకట్; సంగీతం: థమన్ ఎస్; డీవోపీ: రిషి పంజాబీ; మాటలు: సౌరభ్ గుప్తా, సాయిమాధవ్ బుర్రా.