11-01-2026 12:31:39 AM
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని సినిమాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అతని తొలిచిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ అనే పేరుతో రూపొందుతున్న విషయం విదితమే. ఈ సినిమాకు ‘ఆర్‌ఎక్స్100’, ‘మంగళవారం’ సినిమాలను అందించిన అజయ్ భూపతి దర్శక త్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ అశ్వినిదత్ సమర్పిస్తున్న ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రాషా తడాని టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.
ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ పోస్టర్, ప్రీ-లుక్ విడుదలయ్యాయి. తాజాగా కథానాయకుడు జయకృష్ణ ఫస్ట్ లుక్ విడుదలైంది. హీరో మహేశ్‌బాబు శనివారం ఈ ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్‌లో జయకృష్ణ చేతిలో గన్ పట్టుకొని, హై స్పీడ్‌లో బైక్ నడుపుతూ కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, జయకృష్ణ ఐఎస్‌సీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. మాధవ్‌కుమార్ గుల్లపాటి ఎడిటర్ కాగా, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.