11-01-2026 12:29:00 AM
రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలు. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ.. “డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. సినిమా ఫుల్‌ఫన్‌గా ఉంటుంది. అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.
అనిల్ రావిపూడి, హరీశ్‌శంకర్, బాబి, కిషోర్.. వీరి డైరెక్షన్‌లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్స్ శివ నిర్వాణతో చేస్తున్నా” అని తెలిపారు. టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. “మిరపకాయ’ వచ్చినా ‘మిస్టర్ బచ్చన్’ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజా రవితేజ. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఆ క్వాలిటీ పవన్ కళ్యాణ్‌లో, తర్వాత రవితేజలో చూశాను. మళ్లీ రవితేజతో బ్లాక్‌బస్టర్ తీస్తా. ఈ సినిమా కంటెంట్ చాలా అద్భుతంగా ఉంది. చాలా ఏళ్లక్రితం జనవరి 11న ‘మిరపకాయ’ రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. మళ్లీ జనవరి 13న ఈ సినిమా వస్తోంది. సంక్రాంతికి చాలా గట్టిగా కొడుతున్నాం” అన్నారు. ‘ఈ సినిమా బొమ్మ బ్లాక్‌బస్టర్ అవుతుంద’ని కథానాయకి డింపుల్ తెలిపింది.
మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. “ఇది అద్భుతమైన జర్నీ. విక్రమార్కుడులో ఆయన రెండు క్యారెక్టర్స్‌ని ప్లే చేసిన విధానం చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. అలాంటి సూపర్ స్టార్‌తో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు” అని చెప్పింది. చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. “ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి యాక్టర్ వాళ్ల మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది” అన్నారు. “జనవరి 13న మా బీఎండబ్ల్యూ (భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైట్‌కి వెళ్లండి. కచ్చితంగా అదిరిపోతుంది” అని నిర్మాత సుధాకర్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ డైరెక్టర్లు బాబీ, శివ నిర్వాణ, పవన్, చిత్రబృందం పాల్గొన్నారు.