calender_icon.png 11 January, 2026 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓ సుకుమారి.. దామిని!

11-01-2026 12:33:05 AM

యంగ్ హీరో తిరువీర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ కలిసి నటిస్తున్న విలేజ్ ఎంటర్‌టైనర్ ‘ఓ.! సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. శనివారం ఐశ్వర్య రాజేశ్ పుట్టినరోజు సందర్భం గా ఆమెను ‘దామిని’గా పరిచే యం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఐశ్వర్య రాజేశ్ స్పిరిటెడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు.

కర్రలు పట్టుకొని తరుముతున్న గ్రామస్థుల నుంచి తప్పించుకునేం దుకు పరుగులు తీస్తున్న ఈ లుక్‌లో ఆమె ధైర్యం, చలాకీతనం గల పల్లెటూరి అమ్మా యిగా ఆకట్టుకుంటోంది. ‘రజాకార్’, ‘పొలిమేర’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సీహెచ్ కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్‌గా పనిచేస్తుండగా, ఎం ఎం కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తున్నారు. ‘బలగం’ ఫేమ్ తిరుమల ఎం తిరుపతి ఆర్ట్ డైరెక్టర్ కాగా, ‘క’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన శ్రీవరప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ చిత్రంలోని పాటలను పూర్ణచారి రాస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.