calender_icon.png 20 September, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కో-ఆర్డినేటర్ గా జయంత్

20-09-2025 08:09:55 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన గంట జయంత్ శనివారం నియామకమయ్యారు.ఈ సందర్భంగా జయంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కో-ఆర్డినేటర్ గా నియమించిన పార్టీ నాయకత్వానికి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కు,సోషల్ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ మన్నెం సతీష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామస్థాయిలో కోఆర్డినేటర్లను ఎన్నిక చేసి పార్టీ ఆలోచనలు,సిద్ధాంతాలు,ప్రజా సమస్యలను సోషల్ మీడియా వేదిక ద్వారా విస్తృతంగా ప్రజలకు చేరేలా కృషిచేసి,పార్టీ బలోపేతానికి పాటుపడతానని అన్నారు.