20-09-2025 08:07:30 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని రవీంద్రఖని రైల్వేస్టేషన్ నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని శనివారం మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. రవీంద్రఖని రైల్వే స్టేషన్ నుండి మహారాష్ట్రకు అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి దాడిచేయగా అధికారులను చూసిన బియ్యం అక్రమ రవాణ దారులు అక్కడి నుండి తప్పించుకోగా ఈ దాడుల్లో మూడు క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల తహశీల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.