calender_icon.png 20 September, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యకు దూరం కాకూడదు

20-09-2025 08:12:47 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సప్తగిరి కాలనీలో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐఐటి, జీ, నీట్ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను ట్రాస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు  యాదగిరి శేఖర్ రావు అందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ, వినయం, విధేయత సహజ లక్షణంగా ఉంటాయని, విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందుతారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానుగుణంగా నూతన విద్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని అప్పుడే కాలంతో పోటీ పడుతూ సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారని తెలిపారు.

 విద్యార్థులు ఏ విషయంగా కూడా నిరూత్సాహపడకూడదని ఫీల్డ్ ట్రిప్ కు వెళ్లే విద్యార్థులకు తాను ఉచితంగా బస్సులను అందిస్తానని అంతేకాకుండా పదవ తరగతిలో 10 జీపీఏ లేదా 570 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఉచిత ఇంటర్మీడియట్ విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. తదుపరి కరీంనగర్ అర్బన్ మండల విద్యాధికారి పుప్పాల కృష్ణ గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యా రంగంలో గొప్ప మార్పులు సాధించవచ్చునని ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రైవేట్ భాగస్వామ్యం ముందుకు రావాలని సూచించారు.