6 August, 2026 | 5:13 PM

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య సేవలు అజరామరం

06-08-2026 04:08 PM

తాండూరులో నివాళి అర్పించిన నేతలు, ప్రజా సంఘాల నాయకులు

తాండూర్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, జన సమితి, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు వేరువేరుగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొని నివాళి అర్పించారు.

 ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్, పలువురు నేతలు మాట్లాడుతూ తెలంగాణ అంటే జయశంకర్, జయశంకర్ అంటే తెలంగాణ . ఆయన చూపిన బాటలో ప్రజా సేవ చేయడమే మనందరి కర్తవ్యం. విద్య, వైద్యం, యువత ఉపాధి కోసం ఆయన కలలు కన్న తెలంగాణ సాధనకు మనం కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.