జయశంకర్ సార్ జీవితం యువతకు ఆదర్శం
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి టౌన్,(విజయ క్రాంతి): జయశంకర్ సార్ జీవితం యువతకు ఆదర్శమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ అవసరాన్ని ప్రజల్లో చాటిచెబుతూ ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహోన్నత వ్యక్తిగా ఆయన నిలిచారని అన్నారు. జయశంకర్ సార్ జీవితం యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






