6 August, 2026 | 5:23 PM

కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ కౌంటర్

06-08-2026 03:58 PM

బీఆర్ఎస్ గా మారి తెలంగాణతో బంధం తెంచుకున్నారు

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారో కేటీఆర్ చెప్పాలి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) చేసిన ఆరోపణలకు  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ నెహ్రూ కుటుంబాన్ని విమర్శించే అర్హత కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి లేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు. దేశం కోసం నెహ్రూ కుటుంబం కోట్ల ఆస్తి, ప్రాణాలు అర్పించారని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నారని, కేంద్ర నిధులు రాబట్టేందుకు ఢిల్లీకి  వెళ్లకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అవుతామంటూ.. టీఆర్ఎస్(TRS) ను బీఆర్ఎస్(BRS) గా మీరు మార్చలేదా?, ఢిల్లీలో కార్యకలాపాల కోసం కోట్ల రూపాయలతో ఒక భవనం ఏర్పాటు చేసుకోలేదా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణతో పేరు బంధం తెంచుకున్న వాళ్లు ఇవాళ జాతీయ పార్టీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జాతీయ పార్టీగా మారి.. ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.