4 July, 2026 | 11:16 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.500 కోట్ల రియల్ ఎస్టేట్ మోసం

02-06-2025 12:09 AM
  1. ఫ్లాట్లను తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేసి న్యాయం చేయాలి 

బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి

ఖైరతాబాద్; జూన్ 1 (విజయ క్రాంతి): రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆవిర్భావంగా మలచి, సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలన్న తమ కోర్కెలను ఆసరాగా చేసుకుని అగ్రిమెంట్ పేరుతో తమ వద్ద నుండి భారీ గా నగదును వసూలు చేసి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిండా ముంచేసింది అని బాధితులు మీడియా ముందు వాపోయారు.

ఈ మేరకు ఆదివా రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో బాధితులు  శ్రీనివాస్ మూర్తి, కుమార్ వర్మ, పాణి, గణే ష్‌లు మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్కు చెందిన కాకర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2021లో జయ త్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హైదరాబాదులో తన కార్యాలయా న్ని ఏర్పాటు చేశాడు.

హైసిటీ పరిధిలోని బాచుపల్లి, గోపనపల్లి, కోకాపేట వంటి ప్రాంతాల్లో వెంచర్ల పేరుతో భారీగా అమాయక ప్రజల నుండి కోట్ల రూపాయలు దం డుకున్నారని అన్నారు.ఈ సంస్థ డైరెక్టర్లుగా కొల్లా వీర వెంకట సత్యనారాయణ మూర్తి, రాజేష్ దిండు, యెల్లంటి చంద్రశేఖర్, మల్ల య్య సానెం, కొల్లా శ్రీనివాసరావు, హరిప్రసాద్ నాగుబండి, బొల్లా శ్రీనివాసరావులు ఉన్నారని ఆరోపించారు.

ఆరంభంలో కొన్ని ప్లాట్లు అప్పగించిన సంస్థ, తర్వాత డిమాండ్ల పెరుగుదలతో ప్రాజెక్టులను నిలిపివేసిందని అన్నారు.. దాంతో హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేయగా, 2022 డిసెంబరులో ఎఫ్‌ఐఆర్ నెంబర్ 1045/2022 కింద కేసు నమోదు చేశారు.

కానీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ను మాత్రమే అరెస్ట్ చేసి, మిగతా నిందితులను పట్టుకోకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని, తమ వద్ద తీసుకున్న డబ్బులను తమకు ఇప్పించాలని లేకుంటే తమకు తమ ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు.