3 July, 2026 | 11:12 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

జేఈఈ మెయిన్ సెషన్--2 ఫైనల్ కీ విడుదల

18-04-2025 12:48 AM

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెష న్-2 ఫైనల్ కీని ఎన్‌టీఏ గురువారం విడుదల చేసింది. ఈ మేరకు ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సెషన్-2 పరీక్షల ను ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఎన్‌టీఏ నిర్వహించింది. గత జనవరి, ఇటీవల జరిగిన రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణన లోకి తీసుకొని ర్యాంకులు కేటాయించనున్నారు.

అయితే, జేఈఈ- మెయిన్ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదా లు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండటంపై తుది కీ వచ్చేవరకు విద్యార్థులు వేచి చూడాలని ఎన్టీఏ సూచించింది. తుది కీ మాత్రమే స్కోరు ను నిర్ణయిస్తుందని, ప్రాథమిక కీల ఆధారంగా ఓ నిర్ణయానికి రాకూడదని స్పష్టం చేసింది.

ఈక్రమంలోనే తుది కీని విడుదల చేసిం ది. గతంలో తుది కీ, ఫలితాల ను ఒ కే రోజు ఎన్టీఏ విడుదల చేసిన సం దర్భాలున్నాయి. దీంతో అభ్యర్థు లు గురువారం 10 గంటల వరకు ఫలితాల కోసం వేచి చూశారు. జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది.