calender_icon.png 22 January, 2026 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యస్థంగా జేఈఈ మెయిన్స్ పేపర్

22-01-2026 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 21(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. అయితే, మొదటి రోజు మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. మొదటి షిఫ్ట్ పేపర్ మ్యాథమెటిక్స్ కాస్త కఠినంగా రావడంతో విద్యార్థులు ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలిసింది.

ఫిజిక్స్ విభాగం నుంచి ఎక్కువగా ఫార్ములా ఆధారిత ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్థంగా వచ్చాయి. రెండో షిఫ్ట్ పేపర్ ఫిజిక్స్ సులభంగా, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మధ్యస్థంగా వచ్చాయి. అయితే మ్యాథ్స్‌కు కాస్త ఎక్కవ సమయాన్ని తీసుకోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈనెల 22, 23, 24, 28, 29 తేదీల్లోనూ పరీక్షలు జరగనున్నాయి.