calender_icon.png 21 January, 2026 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్

21-01-2026 08:32:33 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ బుధవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్ నందు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం విభాగంలో పొనుగోడు హై స్కూల్ విద్యార్థిని సాత్విక సిరి ప్రథమ స్థానంలో, గడ్డిపల్లి హై స్కూల్ విద్యార్థిని వైష్ణవి ద్వితీయ స్థానంలో, తెలుగు మీడియం విభాగంలో వెలిదండ హై స్కూల్ విద్యార్థులు విజయ్ ప్రథమ స్థానంలో లావణ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రధమ ద్వితీయ స్థానంలో నిలిచిన విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. నిరాహాకులు మాట్లాడుతూ... తదుపరి జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాస్, పి నాగరాజు, సివి రావు, బచ్చలకూరి నాగయ్య, సునీత, జ్యోతి, రవి, సతీష్ ,కమల, పలువురు పాల్గొన్నారు.