ఆధిక్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
23-11-2024 11:01 AM
రాంచీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి దూసుకెళ్తుంది. ఆధిక్యాల్లో జేఎంఎం మేజిక్ ఫిగర్ దాటింది. బర్హత్ లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండేలో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్(జేఎంఎం) వెనకంజలో ఉన్నారు. ధన్వార్ లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి ఆధిక్యంలో ఉన్నారు. దుమ్కాలో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్(జేఎంఎం) వెనుకంజలో ఉన్నారు. జంతారాలో సీతా సోరెన్(బీజేపీ) ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. సరాయ్ కెలాలో జార్ఖండ్ మాజీ సీఎం చంపయూ సోరనె(బీజేపీ) ఆధిక్యంలో ఉన్నారు.






