జిగితార.. దిగినావా..
హీరో కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమా నుంచి మరో సాంగ్ ‘జిగితార..’ వచ్చేసింది. శనివారం సాయంత్రం తిరుపతిలో జరిగిన మ్యూజికల్ ఫెస్ట్‌లో ఈ పాటను రిలీజ్ చేశారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, కార్తీక్ పాడారు. ప్రేయసి కోసం ఏదైనా చేసే ప్రేమికుడి మనసుకు అద్దం పడుతూ ఆకట్టుకునేలా సాగుతుందీ గీతం. ‘జిగితార.. జిగితార.. దిగినావా మనసారా, ఆకశాన్ని వీడి ఈ ఆకతాయికై భూమి చేరినావు నా మౌన దేవతై, బతకాలనున్నదే ఇక నీకు బానిసై, ప్రతి రోజు నీకిలా సేవ సేయడానికై..’ అంటూ సాగుతోందీ పాట. శ్రీగౌరి ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఎస్‌కేఎన్, సాయిరాజేశ్ కాంబోలో రూపొందుతోంది. రవి నంబూరి దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాగానే జూలైలో రిలీజ్‌కు రానున్న ఈ చిత్రానికి డీవోపీ: విశ్వాస్ డేనియల్; సంగీతం: మణిశర్మ; ఆర్ట్: భాస్కర్ ముదావత్; ఎడిటర్: సంతోష్ నాయుడు.






