చేగుంటలో సబ్సిడీపై జీలుగ విత్తనాలు
25-05-2026 01:46 AM
చేగుంట, మే 24 : చేగుంట మండలంలో సబ్సిడీపై, జీలుగ విత్తనాలు అందుబాటు లో ఉన్నాయని మం డల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపారు. సోమవారం నుండి వీటి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. 30 కిలోల బస్తా ధర రూ.2,453 కాగా, ఇది 2.5 ఎకరాలకు సరిపోతుంది. విత్తనాలు కావలసిన రైతులు ఆధార్, పట్టాదారు పాస్ బుక్,జిరాక్స్ ప్రతులతో మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.






